తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఇన్నాళ్ళు అధికార టీఆర్ఎస్ పార్టీకి అడ్డే లేదని అనుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, టీడీపీల పరిస్తితి దారుణంగా తయారవ్వడంతో గులాబీ పార్టీకి తిరుగులేదని భావించారు. కానీ అనూహ్యంగా కేంద్రంలో అధికారంలో బీజేపీ పుంజుకుంది. మిగిలిన ప్రతిపక్షాలు కనుమరుగయ్యే స్థితికి చేరుకోవడంతో, కమలం జోరు పెరిగింది.