ఏపీ రాజకీయాల్లో సంచయిత ఓ హాట్ టాపిక్. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్న కుమార్తెగా పరిచయమైన సంచయిత ఇప్పుడు అదే అశోక్ ఫ్యామిలీకి చుక్కలు చూపిస్తుంది. మొదట్లో బీజేపీ సభ్యురాలుగా ఉన్న సంచయితని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అశోక్ గజపతిరాజుని తప్పించి సింహాచలం, మాన్సస్ ట్రస్ట్ ఛైర్మన్గా నియమించారు.