స్థానిక ఎన్నికల విషయంలో చంద్రబాబు తన పంతం నెగ్గించుకునేలా ఉన్నారు. కరోనా పేరుతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం అమలయ్యేలా లేదు. ఎస్ఈసీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ని నిలువరించేలా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించడంతో ఎన్నికలు ఫిబ్రవరిలో అనివార్యంగా మారుతున్నాయి. కోర్టు తీర్పు ప్రకారం, ఎస్ఈసీ నిర్ణయం ప్రకారం ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగితే జగన్ పై చంద్రబాబు పైచేయి సాధించినట్టవుతుంది.