ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకూ ఇస్తున్న ప్యాకేజీ అత్యుత్తమం అని వైసీపీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే ఏలూరు ఘటనతో సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకున్నారు. అత్యుత్తమ ప్యాకేజీకి కూడా మార్పులు చేర్పులు చేశారు. మూర్ఛ వ్యాధితో బాధపడే రోగులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యశ్రీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు వైద్య, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని తెలిపారు.