ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగగా, మరణాలు స్వల్పంగా పడిపోయాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 61,038 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 618 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,73,457కి చేరింది.