ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ శకంలో భాగంగా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా రైస్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి కొత్త కార్డులు జారీ చేసింది. అందుకే రేషన్ కార్డుల సంఖ్య తగ్గింది. నవంబరు 1 నాటితో పోల్చితే 8.44 లక్షల కార్డులను తొలగించడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా కార్డుల సంఖ్య 1,52,70,000 నుంచి 1,44,26,000కి తగ్గింది. గత నెల క్రితంతో పోల్చితే 8.44 లక్షల కార్డులను తొలగించారు.