2020 సంవత్సరం ఏమని మొదలయిందో... ఇక అప్పటినుండి ప్రజల జీవితాలతో 20 - 20 మ్యాచ్ ఆడుతోంది. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో దుర్ఘటనలు... ఎన్నో అనివార్య అడ్డంకులు... తీవ్ర ఇబ్బందులతో ఈ ఏడాది కొనసాగుతూనే ఉంది.అనుకోని సంఘటనలు 2020 సంవత్సరంలో చోటుచేసుకుంటున్నాయి. ఈ ఒక్క నెల అలా గడిచిపోతే 2021 లో ఇక అంతా మంచే జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. అందరూ ఆకాంక్షించినట్లే 2021 ప్రజల జీవితాలలో చీకటిని తొలగించి కొత్త సంతోషాలను తీసుకు రావాలని ఆశిద్దాం.