గుంటూరు జిల్లాలో అధికార వైసీపీలోని కమ్మ ఎమ్మెల్యేని, టీడీపీలో ఓ సీనియర్ నేత టార్గెట్ చేశారు. వినుకొండ నియోజకవర్గానికి చెందిన ఈ కమ్మ నేతల మధ్య ఎప్పటినుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే వినుకొండ ఎప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. అందుకే ఇక్కడ కమ్మ వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత జివి ఆంజనేయులుకు తిరుగులేకుండా ఉండేది. కానీ 2019 ఎన్నికల్లో అదే సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు, జివికి చెక్ పెట్టారు.