ఏపీలో ఎన్నికలు జరగడానికి ఇంకో మూడున్నర ఏళ్ళు ఉంది. అయితే ఈలోపే బీజేపీ దూకుడు కనబరుస్తోంది. అసలు నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం తమదే అని ఇప్పటినుంచే చెప్పేస్తుంది. ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, అధికార వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని మాట్లాడుతున్నారు. మొన్న తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో సత్తా చాటడంతో, ఏపీలో తమ సత్తా చూపిస్తామని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.