పరిటాల రవిపై  గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవ్‌కు పరిటాల రవి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని.. రవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రశాంతంగా ఉన్నారన్నారు. ‘నీ చరిత్ర మాకు తెలుసు.. నీలా రోడ్డెక్కి మాట్లాడి మా విలువ తగ్గించుకోలేం.. మరోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు’అని పరిటాల సునీత సీరియస్‌గా స్పందించారు.