ఇప్పటికే రికార్డు రేంజ్ రెవిన్యూ సంపాదిస్తూ.. సేవల విషయంలో ప్రజల మన్ననలు అందుకుంటుంది. తాజాగా ఆర్టీసీ కార్గో మరో అడుగు ముందుకు వేసి ప్రయోగాత్మకంగా డిసెంబర్ 10 నుంచి పార్శిల్ డోర్ డెలివరీ సేవలు ప్రారంభించింది. తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్ లో ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసు ద్వారా పార్శిళ్లు నేరుగా ఇంటి వద్దకే చేరనున్నాయి.