తిరుపతిలోని వైకుంఠపురంలో ఫ్లెక్సీ కలకలం రేపింది. తిరుపతి లో ఇలాంటి ఫెక్సీలు పెట్టడం నిషేధం. కానీ, ఎర్ర చందనం స్మగ్లర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లం గంగిరెడ్డిని హోటల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న ఫ్లెక్సీలను వైకుంఠపురంలో ఏర్పాటు చేశారు. కొల్లం గంగిరెడ్డితో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫొటోలతో కూడిన ఫొటోలను ఆ ఫ్లెక్సీలో ప్రింట్ చేశారు. దీంతో ఈ ఫ్లెక్సీ తీవ్ర వివాదాస్పదమవుతోంది.