ఆస్ట్రేలియా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లో ప్రతికూల మార్పులు ఎదురైనట్లు గుర్తించారు. దీంతో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమాన్ని అర్ధంతరంగా రద్దు చేశారు. ఈ మేరకు వ్యాక్సిన్ తయారీదారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ, సీఎస్ఎల్ ఔషధ సంస్థ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నాయి.