ఏలూరు ఘటనపై అసలు విషయాలు బైటకు రాకముందే పుకార్లు చాలానే షికార్లు చేసాయి. అయితే వాటిలో ఏ ఒక్కటీ నిజం కాదని ఇప్పుడు అధికారులు తేల్చి చెబుతున్నారు. అసలు ఏలూరు ఘటనకు గాలి, నీరు కలుషితం కావడం ప్రాథమిక కారణం కానే కాదని స్పష్టం చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ భాస్కర్. అది ఓ వ్యాధి కారణం కాదని.. రియాక్షన్ మాత్రమేనని ఆయన చెప్పారు. ఏలూరు ఘటనకు కారణాలు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని.. మరికొన్ని పరిశోధన ఫలితాలు రావాల్సి ఉందని అన్నారాయన.