రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు 2020-21లో వాటి ఖాతాల్లో రూ.7,500 కోట్లు జమ చేశాయని, వాటికి బ్యాంకులు ఇచ్చే వడ్డీ 3 శాతం మాత్రమేనని.. కానీ అదే స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలపై 11 నుంచి 13 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తున్నాయని బ్యాంకు అధికారులకుగుర్తు చేశారు సీఎం జగన్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన ఈ పాయింట్ తీశారు. స్వయం సహాయక సంఘాలు జమచేసే డబ్బులతో బ్యాంకులు ఎంత ఆదాయాన్ని పొందుతున్నాయో వివరించారు. అదే సంఘాలకు తక్కువ వడ్డీరేటుకి రుణాలివ్వమంటే మాత్రం బ్యాంకర్లు ఎందుకు ఆలోచిస్తారంటూ ప్రశ్నించారు.