రాష్ట్రంలో కరోనా కేసులు, ప్రజల్లో కరోనా భయం తగ్గుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అందులోనూ వృద్ధులు, పిల్లలను కరోనా భయం వల్ల దర్శనానికి అనుమతించడంలేదు. ఈ నిర్ణయాన్ని టీటీడీ వెనక్కి తీసుకుంది. అయితే ఇక్కడ కూడా కండిషన్స్ అప్లై అంటున్నారు అధికారులు.