ఏపీలో పదో తరగది విద్యార్థుల్లో ఇప్పటినుంచే ఆందోళన మొదలైంది. అసలు ఈ విద్యా సంవత్సరం పరీక్షలు ఎలా నిర్వహిస్తారు, ఒకవేళ పరీక్షలు పెడితే ఎన్ని పేపర్లుంటాయి, ఎన్ని మార్కులిస్తారు, సిలబస్ ఏంటి అనే విషయంపై ఇంకా వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ కాలేదు. దీంతో పదో తరగతి విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. అటు తల్లిదండ్రులు కూడా ఈ ఏడాది ఎగ్జామ్ ప్యాట్రన్ ఎలా ఉంటుందని టెన్షన్ పడుతున్నారు.