మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు సంధిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చంద్రబాబుచేసిన వ్యాఖ్యల్ని వారు తప్పుబడుతున్నారు. ఐదు శాతం ఓట్లు మారితే చాలు టీడీపీదే విజయం అని చంద్రబాబు చెప్పారని, అటు ఇటు ఓట్లు మారడానికి ఇదేమైనా గాంబ్లింగా అని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని. రాష్ట్రంలో ఉండటానికే భయపడుతున్న చంద్రబాబుకి ఐదుశాతం ప్రజలైనా ఓటు ఎందుకు వేయాలని అడిగారు.