ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఉద్యోగులు ఊహించని షాకిచ్చారు.వివారాల్లోకి వెళితే..ఎన్నికల నిర్వహణపై స్టే విధించలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పడంతో నిమ్మగడ్డ రమేష్ చకచకా పావులు కదుపుతున్నారు. జగన్ సర్కారు మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉండగా, ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించేది లేదని తెగేసి చెబుతోంది. అయినా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ మాత్రం ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది.ఈ తరుణంలో ఉద్యోగులు ఇప్పట్లో ఎన్నికలు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తేల్చి చెప్పారు.