తిరుమల టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకునే భక్తులను పదే పదే హెచ్చరిస్తున్నారు అధికారులు. అసలైన వెబ్ సైట్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నకిలీ వెబ్ సైట్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని చెబుతున్నారు. ఇటీవల కాలంలో తిరుమల పేరుతో పలు నకిలీ వెబ్ సైట్లు పుట్టుకు రావడం, సోషల్ మీడియాలో అసలు వెబ్ సైట్ కంటే, ఆయా నకిలీ వెబ్ సైట్లకే ఎక్కువ ప్రచారం రావడం కలవరపెట్టే అంశం. భక్తులు కూడా ఇలాంటి నకిలీ వెబ్ సైట్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న ఉదాహరణలున్నాయి. అందుకే టీటీడీ అధికారులు ఇలాంటి నకిలీ వెబ్ సైట్లపై దృష్టిపెట్టారు. భక్తులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు.