తెలంగాణ రాజకీయాల్లో ఉన్నట్టుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాగా హుషారయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల టైమ్ నుంచి కిషన్ రెడ్డి తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. గతంలో కూడా ఆయన యాక్టివ్ గానే ఉన్నా కూడా కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత రిలాక్స్ అయ్యారు. అయితే రాష్ట్ర పార్టీపై బండి సంజయ్ అజమాయిషీ పెరిగిపోవడంతో కిషన్ రెడ్డి త్వరగానే సర్దుకున్నారు. సంజయ్ తనకంటే పైకి ఎదిగే లోపే కట్టడి చేయడానికి సిద్ధపడ్డారు. అందుకే తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కిషన్ రెడ్డి.