గతంలో చిరంజీవి కూడా తన రాజకీయ ప్రస్థానంపై చాన్నాళ్లు మధన పడి చివరకు పార్టీ పెట్టారు. ఇప్పుడు రజినీకాంత్ కూడా అంతే.. చాన్నాళ్లపాటు చర్చోప చర్చలు జరిపి చివరకు తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఈనెల 31న పార్టీ ప్రకటన, జనవరి 1నుంచి కార్యాచరణ అని తేల్చి చెప్పారు. అయితే పార్టీ పెడతామని చెప్పే వరకు చిరంజీవి, రజినీకాంత్ ఇద్దరూ చాన్నాళ్లపాటు భవిష్యత్ గురించి ఆలోనచలు చేశారు. కానీ పార్టీ పెట్టిన తర్వాత మాత్రం అన్ని పనులు చకచకా సాగిపోయాయి.