ఆదివారం శ్రీకాళహస్తిలో జరిగిన నవరత్నాల విజయోత్సవ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే ఈసారి పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవాలని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఆయన కుప్పంలో పోటీ చేసినా ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు.