తిరుమలలో స్వామివారి ఉచిత ప్రసాదాలు కొంతమందికే దక్కుతున్నాయి. దీంతో మిగతా వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికే ఉచిత ప్రసాదాలు ఎందుకిస్తున్నారంటూ మండిపడ్డారు. టీటీడీ తీరుకి నిరసనగా ఆలయం ముందు ఆందోళన చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.