పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం పెద్దకుడాలకు చెందిన మహిళ నాగమ్మని(45) ఈ నెల 7న దారుణ హత్య చేశారు. మేకలు కాసేందుకు వెళ్లిన ఆమె పొదల్లో శవమై కనిపించింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.