ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ను బదిలీ చేసేందుకు కుట్ర జరుగుతోందని, న్యాయ వ్యవస్థపై ఏపీ ప్రభుత్వం దాడి చేస్తోందని, హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీకి ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. ప్రభుత్వం తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాలను కోర్టులు నిలువరిస్తే.. వాటిని సరిదిద్దుకుని సక్రమంగా పాలన అందించాలే కానీ న్యాయ వ్యవస్థపై దాడికి దిగడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారాయన.