ఢిల్లీలో కేంద్ర పెద్దల్ని కలసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, నిధులు విడుదల చేయాలని కోరిన కేసీఆర్ కి రెండు రోజుల వ్యవధిలోనే కేంద్రం పెద్ద షాకిచ్చింది. తెలంగాణ ప్రాజెక్ట్ లకు న్యాయం చేయాలంటూ ఈ నెల 11న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలసి కేసీఆర్ వినతి పత్రం అందించారు. అయితే అదే తేదీతో కేంద్ర మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన లేఖ తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు చేరింది. ఆ లేఖలోని అంశాలు తెలంగాణ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ఇబ్బంది కలిగించేలా ఉండటం గమనార్హం.