కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ గురించి అప్పుడే హడావిడి మొదలైంది. కేంద్రం నుంచి తొలి దశ డోసులు తీసుకున్న తర్వాత ఎవరెవరికి ముందు టీకా వెయ్యాలి, ఎవరికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పాటికే నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి వచ్చే తొలి దశ టీకా మొదటిగా హెల్త్ వర్కర్లకు చేరుతుంది. ఆ తర్వాత టీకా తీసుకున్న హెల్త్ వర్కర్లు ముందుగా పని మొదలు పెడతారు. పోలీసులకు, శానిటేషన్ వర్కర్లకు రెండో ప్రయారిటీ ఇస్తున్నారు. వీరందరికీ టీకా పంపిణీ పూర్తయిన తర్వాతే వృద్ధులకు వరుస క్రమంలో టీకా అందుతుంది.