జర్నలిస్ట్ ల అక్రిడిటేషన్ కమిటీల్లో జర్నలిస్ట్ సంఘాలకు చోటు లేకపోవడంతో మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి క్లారిటీ ఇచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. వేతనాల స్థిరీకరణ, ఉద్యోగ భద్రత కల్పించేలా కలిసి ముందుకు సాగాలన్నారు. పాత్రికేయులు రాసే వార్తలు ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలన్నారు బొత్స. ఏపీ ప్రెస్ అకాడమీ నిర్వహించిన ఆన్లైన్ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ నిర్ణయంపై క్లారిటీ ఇచ్చారు. మంత్రి ప్రకటనతో మరోసారి జర్నలిస్ట్ సంఘాలకు నిరాశ ఎదురైంది.