ఆంధ్రప్రదేశ్ లో  సోమవారం 541 మంది కోవిడ్ 19 బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,64,049 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,728కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,08,75,925 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో తెలిపింది.