తెలంగాణా రాష్ట్రంలోని స్కూళ్లలో దాదాపు 15 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2017 సంవత్సరంలో 8,972 టీచర్ పోస్టులను భర్తీ చేసిన విద్యాశాఖ తాజాగా మరో 15 వేలకు పైగా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉందట. ప్రస్తుతం స్కూళ్లలో టీచర్ ఖాళీల స్థానాల్లో విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు.అందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఉండి.. ఒక్కరిద్దరే టీచర్లు ఉన్న స్కూళ్లు, సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్లలో గతేడాది 15,661 మంది విద్యా వలంటీర్లు పని చేయడం జరిగిందట.