ఓవైపు భారత ప్రభుత్వం కరోనా టీకా పంపిణీకోసం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. టీకా వస్తే.. ముందుగా ఎవరికి వేయాలి, ఎంతమందికి వేయాలనే జాబితాను రాష్ట్ర ప్రభుత్వాలనుంచి తెప్పించుకుంటోంది. అసలింతకీ కరోనా టీకా వేయించుకోడానికి భారతీయులు సిద్ధంగా ఉన్నారా? ఉచితంగా ఇచ్చే ఈ టీకాని ఎంతమంది తమకు కావాలనుకుంటున్నారు. ఈ విషయంపై ఇటీవల జరిగిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.