ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారనగానే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఓ దఫా ఆయన హస్తిన వెళ్లొచ్చారు. కొన్ని రోజుల ముందుగానే.. రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కూడా ఢిల్లీ వెళ్లొచ్చారు. ఇంతలోనై సీఎం జగన్ ప్రయాణం కట్టడంపై రాజకీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.