టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫైనల్ కు చేరుకున్నారని తెలుస్తోంది. అయితే అందులో ఎవరిని పదవి వరిస్తుందనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ మాత్రం ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని, కసరత్తు జరుగుతోందని తేల్చి చెప్పారు. అయితే టీపీసీసీ పీఠం రేవంత్ రెడ్డికే దక్కుతుందనే ప్రచారం రోజు రోజుకీ ఎక్కువవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తాననడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది.