సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని ఫాలో అవుతున్నారు. పాలిటిక్స్ లో రజినీకంటే పవన్ కల్యాణే సీనియర్ కాబట్టి.. ఆయనకు ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ పెట్టడం, ప్రచారం చేయడం.. ఇలాంటి విషయాల్లో పోలికలు లేవు కానీ.. బీజేపీతో దోస్తీ విషయంలో మాత్రం ఇద్దరి మధ్యా పోలిక ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన పెట్టిన తర్వాత తొలిసారిగా పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేయలేదు. బీజేపీ, టీడీపీతో కలసి పోటీ చేశారు. ఇప్పుడు కూడా పవన్ బీజేపీతో సయోధ్యలోనే ఉన్నారు.