ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ(పాడా)పై సమీక్షించారు. అధికారులతో అభివృద్ధి పనులపై చర్చించారు.. కీలక సూచనలు చేశారు. పులివెందులలోని ఏపీ-కార్ల్ సంస్థలో ఈ నెల 24న గుజరాత్ రాష్ట్రం ఆనంద్ ప్రాంతానికి చెందిన గ్రామీణ మేనేజ్మెంట్ సంస్థ (ఇర్మా)కు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. అలాగే కడప విమానాశ్రయంలో రాత్రిపూట కూడా విమానాలు దిగేలా రన్‌వేను విస్తరించాలన్నారు. దీనికి సంబంధించి 47 ఎకరాలను సేకరించి విమానాశ్రయ సంస్థకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఆ సమీపంలోని బుగ్గవంకలో 7 కిమీ భద్రత గోడ నిర్మించగా, మిగిలిన 3 కిమీ నిర్మాణంతోపాటు రోడ్లు, మురుగు నీటి వ్యవస్థకు అదనంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.