సోషల్ మీడియాలో జడ్జిలు, న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర పోస్టింగ్‌లు, వ్యాఖ్యలు చేసిన కేసు విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తును నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం దర్యాప్తుపై తదుపరి స్థాయి నివేదికను మార్చి 30లోపు కోర్టుకు సమర్పించాలని కోరుతూ విచారణను మార్చి 31కి వాయిదా వేసింది.