చాల మందికి టీ తాగడం అలవాటు ఉంటుంది. ఉదయం నుండి రాత్రి వరకు అనేక సార్లు టీ తాగుతూ ఉంటారు. అయితే సాధారణంగా ఆఫీసుల్లో పనులతో అలసిపోయినా.. ఇంటి పనులతో తలమునకలైనా మొదటిసారిగా గుర్తొచ్చేది టీనే. ఒక కప్పు పొగలు కక్కే టీ తాగడం వల్ల అప్పటి వరకూ ఉన్న ఒత్తిడి అంతా ఒక దెబ్బతో పోతుంది. ఇక కొందరు అసలు ప్రోద్దున్నే టీ తాగితే కానీ.. ఏ పని చేయలేం అన్నంతగా దానిని అలవాటుగా మార్చుకుంటారు.