జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మద్దతు పలికిన అగ్ర పార్టీకే బాయ్ చెప్పనున్నారట. రాజకీయంలో స్నేహం అన్నాక నాయకులు ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సి ఉంటుంది. నేను వారికీ చేశాను కానీ, నాకు ఏమీ తిరిగి రాలేదు అన్న ఆలోచనలో ఉన్నారట పవన్. ఇంతకీ విషయం ఏంటంటే..?? ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయపరంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. తన పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా... ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి.