ఏపీ పోలీస్ విభాగానికి ఇప్పటికే పలు జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. తాజాగా ఏపీ పోలీస్, ఐసీజేఎస్ విభాగంలో దేశవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ పోలీస్ కి అవార్డు అందించారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వర్చువల్ విధానం ద్వారా ఈ అవార్డు అందుకున్నారు. ఇంటర్ అపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)లో పోలీస్ డిపార్ట్ మెంట్ సహా, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్, తదితర విభాగాలుంటాయి. వీరందరితో కలసి బాధితులకు సత్వర న్యాయం అందేలా ఏపీ పోలీసులు కృషి చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని కేంద్ర హోం శాఖ అభినందించింది.