తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం అత్యధికంగా 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించింది. ఇక రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2018 మే 18న ఉద్యోగులకోసం తొలి వేతన సవరణ కమిషన్ (పి.ఆర్.సి.) ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ నివేదిక ఆలస్యం కావడంతో గడువు పెంచుకుంటూ పోయారు. ఇలా పెంచుకుంటూ పోయిన ఆఖరి గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ గడువులోపు నివేదిక వచ్చి కొత్త పి.ఆర్.సి.ని ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. దీంతో ఈ అంశం త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.