కేంద్ర మంత్రులతో భేటీకోసం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్.. హోం మంత్రి అమిత్ షా ని ఇరుకున పెట్టారని తెలుస్తోంది. మూడు రాజధానులకు మద్దతు కోరుతూనే ఆయన ప్రత్యేకంగా న్యాయ రాజధాని అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశాన్ని చెబుతున్నప్పుడు బీజేపీ మేనిఫెస్టో సంగతి కూడా సీఎం ఉదహరించారట. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశం ఉందని అమిత్ షా కు తెలిపిన సీఎం జగన్.. ఆ మేరకు మూడు రాజధానులకు మద్దతివ్వాలని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకి ఉన్న అడ్డంకులు తొలగించాలని కోరారట.