ఇసుక తవ్వకాలపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ అవసరాలకోసం ఇసుక లభ్యత భారీగా తగ్గిపోయింది, దీంతో రేట్లు కూడా అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఇసుక లభ్యతను పెంచేలా ఉంది. ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నదులు, రిజర్వాయర్లలో డ్రెడ్జింగ్ చేసుకోవచ్చని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో రిజర్వాయర్లు, నదులలో డ్రెడ్జింగ్ చేసుకునే అవకాశం లభించింది.