తిమ్మాపురం గ్రామానికి చెందిన కునుకుంట్ల వెంకన్న కూతురు పావని (21) ఈ నెల 6 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆత్మహత్య చేసుకున్న పావని మృతదేహాన్ని గుర్తించారు. ఓ పత్తి చేనులో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీసులు పోస్టుమార్టకు తరలించారు.