ప్రకాశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ స్టార్ తీసుకొద్దామని వెళ్తున్న ముగ్గురు యువకులను మృత్యువు కబళించింది. ఓవర్టేక్ చేయబోయి బైక్ లారీని ఢీ కొట్టడంతో ముగ్గురు మిత్రులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ అత్యంత విషాద ఘటన మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లై ఓవర్పై జరిగింది.