కరోనా వైరస్ విషయంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది.కరోనా నియంత్రణకు అవసరమైన మేరకు ప్రభుత్వం పరీక్షలు చేస్తుందని, రోజూ 50 వేల పరీక్షల నిర్వహణ కష్టమని కోర్టుకు తెలిపింది. పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కరోనా పరీక్షల అంశంలో హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై స్టే ఇచ్చింది.