వాట్సప్ పేమెంట్స్ కి గతంలో భారత ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో రెండు కోట్ల మందికి వాట్సాప్ పేమెంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఓ నాలుగు బ్యాంకులతో ఒప్పదం చేసుకుంది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని కంపెనీ స్వయంగా ప్రకటించింది.