ఆలయాల పరిరక్షణకోసం బీజేపీ నేతలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గతంలో కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో ఆలయాలు కూల్చేశారని, వాటిని పునర్నిర్మించాలంటూ ఆందోళన చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వం చేసినట్టే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తోందని మండిపడ్డారు. అయితే ఈ ఆందోళన తర్వాత వెంటనే వైసీపీ తరపున దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఆధారాలతో సహా ఆయన ప్రెస్ మీట్ లో కూర్చుని అన్నీ బైటపెట్టారు. అసలు తప్పు జరిగింది టీడీపీ హయాంలో అని, అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీకి చెందిన పైడికొండల మాణిక్యాల రావు ఉన్నారని గుర్తు చేశారు.