తిరుపతి లోక్ సభ ఎన్నికలకోసం జనసేన ఓ కార్యనిర్వాహక కమిటీ వేసింది. మొత్తం 10మందితో ఓ టీమ్ తయారు చేసింది. తిరుపతి పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అన్ని వ్యవహారాలు వీరు పర్యవేక్షిస్తారు. అంటే అభ్యర్థిని ఎంపిక చేసి, పవన్ ఆమోదం కోసం పంపించాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉంది.