అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘అమరావతి రక్షణకై జనభేరి’ పేరుతో రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు 20 వేల మందికిపైగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. సభ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని అమరావతి పరిక్షణ సమితి నేతలు తెలిపారు. చంద్రబాబు సహా ఇతర పార్టీల ప్రతినిధులు ఈ జనభేరి సభకు వస్తారని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం భారీగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.